ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై సాధారణ అబ్జర్వర్లు, వ్యయ పరిశీలకులు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తో కలిసి సమీక్షించి మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అందరూ కలిసి సమన్వయంతో ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు, కలెక్టర్ అన్ని విధాల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సార్వత్రిక ఎన్నికల సాధారణ ప‌రిశీల‌కులు 23 – తిరుపతి (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ని 119- సర్వేపల్లి (ఎస్పీ ఎస్ ఆర్ నెల్లూరు) 120- గూడూరు (ఎస్.సి.) అసెంబ్లీ, 121– సూళ్ళురుపేట (ఎస్.సి.) అసెంబ్లీ, 122 – వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు కరీగౌడ ఐఏఎస్, 23- పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 167 – తిరుపతి, 168 – శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్. సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులు, 23 – తిరుపతి (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గం – వ్యయ పరిశీలకులు – ప్రదీప్ కుమార్, 166 – చంద్రగిరి, 167 – తిరుపతి, 168 – శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులు వి.జి శేషాద్రి, 120- గూడూరు (ఎస్.సి.) అసెంబ్లీ, 121– సూళ్ళురుపేట (ఎస్.సి.) అసెంబ్లీ, 122 – వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులు మీను ఓలా పోలీస్ పరిశీలకులు అరవింద్ సాల్వే వారు కలెక్టర్, ఎస్పీ తో కలిసి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులు సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో చేపట్టిన ఎన్నికల సన్నద్ధత పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ సిబ్బంది ఏప్రిల్28, ఈవిఎం సెకండ్ ర్యాండమైజేషన్ ఆర్ఓ లతో మే1న, ఈవిఎం కమిషనింగ్ మే3న రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టడం జరుగుతుందని టైం లైన్ షెడ్యుల్ మేరకు చేపడుతున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూం ల వద్ద సరిపడా సీసి కెమెరా ఏర్పాటు, భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేపట్టడం జరిగిందని, పిడబ్ల్యుడి, 85 సంవత్సరాల పైబడిన ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. 2140 పోలింగ్ కేంద్రాలలో 696 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల విధులు, బాధ్యతలు, పలు ఎన్నికల అంశాలపై బూత్ స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గస్థాయి, సెక్టర్ అధికారులకు, పోలీస్ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి తదితరులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ వివరిస్తూ ఎస్ఎస్టి, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, సీజర్ వివరాలు, సెబ్ వివరాలు తెలిపారు. 8 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, 10 అంతర్ జిల్లాల చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. నగదు, మద్యం, విలువైన లోహాలు, ఫ్రీ బీస్ తదితరాలు కలిపి జిల్లాలో సుమారు రూ.18.91 కోట్లు సీజ్ చేయడం జరిగింది అని తెలిపారు. సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఓటరు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు అందరూ కలిసి సమన్వయంతో చేపట్టాలని సూచించారు. వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఎన్నికల నిబంధనల మేరకు నియోజక వర్గంలో ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు రికార్డ్ నిర్వహణ పక్కాగా ఉండేలా చూడాలని, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జెసి ధ్యాన చంద్ర హెచ్ఎం, అదితి సింగ్, నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా నోడల్ అధికారులు, పోలీస్, రెవెన్యూ ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.