యువ‌త భ‌విష్యత్తే…రాష్ట్ర భవిష్య‌త్‌..అదే చంద్ర‌బాబు ఆలోచ‌న‌…మాజీ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):
యువ‌త భ‌విష్య‌త్తే…రాష్ట్ర భ‌విష్య‌త్ అని…మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని…చంద్ర‌బాబునాయుడు సీఎం అయితేనే యువ‌త భ‌విష్య‌త్ కు గ్యారెంటీ అని… మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో… ఆయ‌న నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం 44 డివిజ‌న్ పోస్టాఫీసు సెంట‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ముందుగా నారాయ‌ణ‌కి డివిజ‌న్‌లోని ప్ర‌జ‌లు అడుగ‌డుగునా హార‌త‌లు ప‌ట్టి… జై టీడీపీ జై నారాయ‌ణ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ ప్ర‌చార ర‌థంపై ప‌ర్య‌టిస్తూ… ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంద‌రూ సైకిల్ గుర్తుపై ఓట్లేసి…న‌న్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. ఏ డివిజ‌న్‌కెళ్లినా ప్ర‌జ‌ల స్పంద‌న అనూహ్యంగా ఉంద‌ని…అందుకు కార‌ణంగా 2014 నుంచి 2019 వ‌ర‌కు టీడీపీ ప్ర‌భుత్వంలో నేను చేసిన అభివృద్ధేన‌న్నారు. 2019 నుంచి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చామ‌ని…కానీ ఛాన్స్ ఇచ్చి ఎంతో న‌ష్ట‌పోయామ‌ని ప్ర‌జ‌లే చెబుతుండ‌డం నిజంగా చాలా బాధాక‌ర‌మ‌న్నారు. ఈ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌తోపాటు వ్యాపారాస్తులు ఎంతో న‌ష్ట‌పోయార‌ని…ఏ రోజు షాప్ ప‌గుల‌గొడుతారా…? ఏ రోజు షాప్ లైసెన్స్ ర‌ద్దు చేస్తారా… ఏ రోజు అరెస్ట్ చేస్తారా అని…బిక్కు బిక్కు మంటూ వ్యాపారాలు చేసుకుంటున్నార‌న్నారు. ఈ ప్ర‌భుత్వంలో ఎవ‌రికి సెక్కూరిటీ లేద‌న్నారు. ప్ర‌భుత్వం అంటే ప్ర‌జ‌ల సెక్కూరిటీతోపాటు సంక్షేమం, వారి డెవ‌ల‌ప్ మెంట్ చూడాల‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో యువ‌త భ‌విష్య‌త్ ఏంటోన‌ని వారికే అర్ధం కాని ప‌రిస్థితిలో ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. గ‌త ఐదేళ్లుగా యువ‌త‌కు ఉద్యోగాలు రాక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌న్నారు. వ్యాపారాలు బాగా జ‌రిగి…ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తే…ఆటోమెటిక్‌గా యువ‌త‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌న్నారు. కానీ మ‌న రాష్ట్రంలో వ్యాపారస్తులు ప్ర‌శాంతంగా వ్యాపారాలు చేసుకోలేర‌ని…ప‌రిశ్ర‌మ‌లు రావ‌ని…ఉన్న‌వే ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిపోతున్నాయ‌న్నారు. అదే విధంగా రియ‌ల్ ఎస్టేట్ పూర్తిగా ప‌డిపోయింద‌న్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం త‌గ్గిపోయింద‌న్నారు. వ్యాపారాలు, ప‌రిశ్ర‌మ‌లు, రియ‌ల్ ఎస్టేట్ ఇవ‌న్నీ బాగా జ‌రిగితేనే…ప్ర‌భుత్వానికి అనేక రూపాల్లో ట్యాక్స్ లు వ‌స్తాయ‌ని…రాష్ట్ర ఖ‌జానా నిండుతుంద‌న్నారు. అప్పుడు కొంత భాగం డెవ‌ల‌ప్ మెంట్‌, కొంత భాగం సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేయ‌వ‌చ్చ‌న్నారు. గ‌త ఐదేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం లేక‌పోవ‌డంతో… రూ. 13 ల‌క్ష‌ల కోట్లు అప్పు తెచ్చింద‌ని ఆరోపించారు. మీ అంద‌రి స‌హ‌కారంతో…తెలుగుదేశం ప్ర‌భుత్వం ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తుంద‌ని…రాగానే చంద్ర‌బాబునాయుడు ఇత‌ర దేశాలు, రాష్ట్రాల నుంచి అనేక ప‌రిశ్ర‌మ‌లను మ‌న రాష్ట్రానికి తీసుకువ‌స్తార‌న్నారు. నేను అధికారంలోకి రాగానే… నెల్లూరులో యువ‌త కోసం స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏర్పాటు చేస్తాన‌ని…వారి ఆర్ధికాభివృద్ధి కోసం కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంద‌రూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి…న‌న్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు.