ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని నానుడి కావలి తెలుగుదేశం అభ్యర్థి విషయంలో కనిపిస్తోంది. కావలి నియోజకవర్గం నుండి బిజెపి టిడిపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ పార్టీల మేనిఫెస్టో విడుదల తర్వాత నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా కావలి వైసీపీ కి మరో బిగ్ షాక్ తగిలింది.. ముస్లిం మైనారిటీ నాయకులు, కావలి పట్టణ 22వ వార్డు వైసీపీ ముఖ్య నాయకుడు, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు నాయబ్ రసూల్, ఆయన సతీమణి నాటక అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ షేక్ సమీనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి బుధవారం తెలుగుదేశం పార్టీలోకి చేరారు.. వీరికి ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని క్రిష్ణారెడ్డి వారికి హామీ ఇచ్చారు.. ముస్లిం సామాజిక వర్గం మొత్తం ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతుండగా, మిగిలిన వారు సైతం టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారు.. వైసీపీ కోటకు బీటలు వాలుతుండటంతో వైసీపీ నేతల్లో అంతర్మధనం మొదలయింది.. గెలిచే పార్టీలోకి పోవడమే బెటర్ అని, టీడీపీ వైపు చూస్తునట్లు తెలుస్తుంది.. కూటమి మ్యానిఫెస్టో విడుదల తరువాత వైసీపీ ముఖ్య నాయకులు టిడిపిలోకి చేరడం విశేషం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందన్న అంచనాలతో రానున్న పది రోజుల్లో టీడీపీ లోకి భారీగా వైసీపీ నాయకులు చేరానున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కావలి అభివృద్ధి చెందాలంటే కావ్య క్రిష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలనేది ప్రజల్లో బలంగా ఉండటంతో కావలి లో టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించనున్నదని ప్రజలు భావిస్తున్నారు.