ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ప్రజలను మోసం చేయడం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నైజమని ఉరవకొండ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.అదే సమయంలో చెప్పిన ప్రతిమాటను నెరవేర్చే గొప్ప మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.ఉరవకొండ నియోజకవర్గంలో వైస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదివారం వజ్రకరూరు కమలపాడు, కమలపాడు తాండ, గుళ్యపాళ్యం గ్రామాల్లో వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ అధికారం కోసం ఎన్ని హామీలైన ఇచ్చి ప్రజలను మోసం చేసే నైజం చంద్రబాబుదని, 2014 లో అధికారం కోసం 600 లకు పైగా హామీలు గుప్పించి ఆ తరువాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడని చెప్పారు. దీన్ని ప్రజలు గుర్తుకు చేసుకోవాలన్నారు. జగన్ అలా కాదని 2019 ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చారన్నారు.ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో పేద ప్రజలకు మరింత అండగా నిలుస్తుందని వెల్లడించారు. నూటికి నూరు శాతం హామీలన్నీ నెరవేర్చుతాడాని ధీమా వ్యక్తం చేశారు. మరోమారు సీఎంగా జగన్ బాద్యతలు చేపట్టిన తరువాత మరింత పటిష్టంగా పథకాలు అమలు చేస్తారని వివరించారు. గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో పేదలకు, ముఖ్యంగా మహిళకు పెద్దపీట వేసి అన్ని విధాలా అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో మహిళలని భాగస్వామ్యం చేయడం జరిగిందని చెప్పారు. జగన్ పాలన లో రైతులకు రైతు భరోసా, ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకున్నాడని తెలిపారు. 2023 ఖరీఫ్ కు సంబంధించి పంట నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించడం జరిగిందని త్వరలోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతాయని అన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనించి ఏ ప్రభుత్వం మంచి చేసిందో గుర్తించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను ,ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణల ఫ్యాను గుర్తు కే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.