ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే… నెల్లూరు న‌గ‌రం మ‌ద్రాస్ బ‌స్టాండ్ వ‌ద్ద ఉన్న ఏసీ కూర‌గాయ‌ల మార్కెట్లో వాట‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ వ్యాపార‌స్తులంద‌రికి హామీ ఇచ్చారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా… ఆయ‌న ఎంపీ అభ్య‌ర్థి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రూర‌ల్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. ముందుగా వారికి వ్యాపార‌స్తులంద‌రూ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మార్కెట్లోని ప్ర‌తీ ఒక్క వ్యాపారస్తుడిని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ…వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. 2024లో వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మేన‌ని…రాగానే మార్కెట్లో వాట‌ర్ స‌మ‌స్య‌తోపాటు…ఇంకా ఏ స‌మ‌స్య‌లున్నా మీ అంద‌రితో చ‌ర్చించి ప‌రిష్క‌రిస్తామ‌ని నారాయ‌ణ హామీ ఇచ్చారు. అనంత‌రం డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. నేను, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఈ రోజుల కూర‌గాయ‌ల మార్కెట్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించామ‌న్నారు. ప్ర‌ధానంగా ఇక్క‌డ వ్యాపార‌స్తులంద‌రూ వాట‌ర్ ప్రాబ్లం అధికంగా ఉంద‌ని మా దృష్టికి తీసుకువ‌చ్చార‌న్నారు. మ‌న ప్ర‌భుత్వం రాగానే…ఖ‌చ్చితంగా ఫ‌స్ట్ మార్కెట్లో మీ అంద‌రికి వాట‌ర్ క‌నెక్షన్లు ఏర్పాటు చేసి…వాట‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. అదే విధంగా త్వ‌ర‌లోనే వ్యాపారాస్తులంద‌రితో కూర్చొని మాట్లాడి…వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని వాటిని కూడా ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌ని చెప్పారు. ఈ రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని మీ అంద‌రికి తెలిసిందేన‌న్నారు. రాష్ట్రంలో డెవ‌ల‌ప్ మెంట్ ఉంటేనే వ్యాపార‌స్తులంద‌రూ సక్ర‌మంగా వ్యాపారాలు చేసుకునే వెసులు బాటుంద‌న్నారు. రోడ్లు, వాట‌ర్‌, డ్రైన్‌, ప‌వ‌ర్ ఇవ‌న్నీ ఏర్పాటు చేస్తే…ఆటోమెటిక‌గా సిటీ డెవ‌ల‌ప్ అవుతూ ఉంటుంద‌న్నారు. అప్పుడు వ్యాపారాలు బాగా జ‌రుగుతాయ‌ని…అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. కానీ మ‌న రాష్ట్రంలో ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. ఉన్న వ్యాపార‌స్తులంద‌రూ ఈ ప్ర‌భుత్వం దెబ్బ‌కి ప‌క్క రాష్ట్రాల‌కి వెళ్లిపోతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఎప్పుడు బిల్డింగ్ ప‌గుల గొడుతామా…? ఎవ‌రి లైసెన్సు ర‌ద్దు చేస్తామా…ఎవ‌రిపైన కేసులు పెట్టిస్తామా అది త‌ప్ప ఈ ప్ర‌భుత్వానికి మంచి చేద్దామా…న‌గ‌రాన్ని డెవ‌ల‌ప్ చేద్దామా అన్న ఆలోచ‌నే లేద‌న్నారు. ఈ సారి ఖ‌చ్చితంగా 2024లో తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం ఖాయ‌య‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ మ‌న ప్ర‌భుత్వం రాగానే… హోల్ సేల్ వ్యాపార‌స్తులంద‌రికి బ‌య‌ట మార్కెట్ ఏర్పాటు చేయ‌గ‌లిగితే అది మంచి అవుతుంద‌న్నారు. అధికారంలోకి రాగానే మార్కెట్లోని వ్యాపారాస్తులంద‌రితో చ‌ర్చించి…వారి స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. వ్యాపారాలు బాగా జ‌ర‌గాలంటే…రాష్ట్రంలో అభివృద్ధి ఉండాల‌న్నారు. అందుకు చంద్ర‌బాబుని ముఖ్య‌మంత్రిగా చేసుకోవాల్సిన బాధ్య‌త మ‌న అంద‌రిపై ఉంద‌న్నారు. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని…ఫండ్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని… డెవ‌ల‌ప్‌మెంట్‌, సంక్షేమం రెండూ అభివృద్ధి జ‌రుగుతాయ‌న్నారు. మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు, వ్యాపారాస్తులంద‌రూ సైకిల్ గుర్తుపై ఓటేసి… ఎంపీగా న‌న్ను, సిటీ ఎమ్మెల్యేగా నారాయ‌ణ‌ను, రూర‌ల్ ఎమ్మెల్యేగా శ్రీ‌ధ‌ర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు.