ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): పేద‌ల అభివృద్ధి కోస‌మే..టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చార‌ని మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తె సింధూర పొంగూరు తెలిపారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా…ఆమె నెల్లూరు సిటీ 47వ డివిజ‌న్ విజయ్ మహల్ గేట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ముందుగా సింధూర‌కి ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇంటింటికెళ్లి నారాయ‌ణ చేసిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కి వివ‌రించారు. మ‌న ప్ర‌భుత్వం రాగానే…మీ స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంద‌రూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లేసి…న‌న్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు. అనంత‌రం డాక్ట‌ర్ సింధూర పొంగూరు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ విజ‌యం సాధించాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ ఎంతో కృషి చేస్తున్నార‌ని…నాయ‌కుల్ని, కార్య‌క‌ర్త‌ల్ని, మ‌హిళా శ‌క్తి టీంని ప్ర‌శంసించారు. గ‌త మూడు నెల‌లుగా నాన్నని గెలిపించాల‌ని కోరుతూ ఇంటింటి ప్ర‌చారం చేస్తున్నాన‌ని చెప్పారు. ఈ రోజుతో డివిజ‌న్‌లోని అన్నీ ఇళ్ల‌ను విజ‌య‌వంతంగా క‌వ‌ర్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అయితే ఈ డివిజ‌న్‌లోని ప్ర‌జ‌లంద‌రూ ఎన్నో స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నార‌న్న విష‌యాన్ని గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నీ తీరిపోతాయి. 2019లో వైసీపీ ప్ర‌భుత్వానికి ఒక్క అవ‌కాశం ఇచ్చార‌న్నారు. అయితే ఏ ఒక్క స‌మ‌స్య తీర‌లేద‌ర‌ని ప్ర‌జ‌లంద‌రూ బాధ ప‌డుతున్నార‌న్నారు. ఎంతో త‌ప్పు చేశామ‌ని ఫీల‌వుతున్నార‌న్నారు. ఈ సారి అలాంటి త‌ప్పు చేయ‌మ‌ని… ఖ‌చ్చితంగా తెలుగుదేశం పార్టీయే గెలుస్తుంద‌ని…దానికి మేమంతా స‌హ‌క‌రిస్తామ‌ని ప్ర‌జ‌లే చెబుతుండ‌డం నిజంగా చాలా సంతోషంగా ఉంద‌న్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా…ఒక పిల్లాడికి మాత్ర‌మే రూ. 15వేలు ఇస్తున్నార‌ని, టీడీపీ ప్ర‌భుత్వం వ‌స్తే…ఇంట్లో ఎంత మంది పిల్ల‌లున్నా వారంద‌రికి రూ. 15వేలు చొప్పున చ‌దువుకునేందుకు ఇస్తుంద‌న్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు, నారాయ‌ణ‌లు చ‌దువుకి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తార‌న్నారు. అదే విధంగా 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మ‌హిళ‌ల‌కు నెల‌కి రూ. 1500 వంతున ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌న్నారు. కానీ వైసీపీ ప్ర‌భుత్వం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మ‌హిళ‌ల‌కు సంవ‌త్స‌రానికి రూ. 16,500 రూపాయ‌లు ఇస్తామ‌న్నారు. అలాగే మ‌హిళ‌ల‌కు సంవ‌త్స‌రానికి మూడు సిలిండ‌ర్లు ఉచితంగా ఇస్తామ‌ని టీడీపీ ప్ర‌భుత్వం చెప్పింద‌న్నారు. ప్ర‌ధానంగా మ‌హిళ‌లంద‌రికి ఆర్టీసీ బ‌స్సుల‌లో ఉచిత ప్ర‌యాణ వ‌స‌తి క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు వాగ్ధానం చేశార‌న్నారు. దానిని వైసీపీ ప్ర‌భుత్వం చేయ‌లేమ‌ని చేతులెత్తేసింద‌ని విమ‌ర్శించారు. వృద్ధుల‌కు 3వేల నుంచి 4వేలు, విక‌లాంగుల‌కు 6వేలు వంతున ఫించ‌ను పెంచుతున్న‌ట్లు చెప్పార‌న్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేక‌పోవ‌డంతో ఖ‌జానా మొత్తం ఖాళీ అయిపోయింద‌ని…దీంతో డెవ‌ల‌ప్ మెంట్‌, సంక్షేమం రెండూ శూన్య‌మ‌న్నారు. ఏవేవో కుంటు సాకులు చెప్పి వృద్ధుల ఫించ‌న్ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఎత్తేసింద‌ని మండిప‌డ్డారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు చంద్ర‌బాబునాయుడు రాష్ట్రానికి ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు తీసుకు వ‌చ్చార‌ని…ఎంతో మంది యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించార‌ని గుర్తు చేశారు. 2019 నుంచి రాష్ట్రంలో ఒక్క ప‌రిశ్ర‌మ కూడా రాలేద‌న్నారు. టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల మేనిఫెస్టోని…వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ ప‌ట్టిన మేనిఫెస్టోను ప్ర‌జ‌లంద‌రూ ఒక గ‌మ‌నించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి నాన్న‌ని ఎమ్మెల్యేగా, వేమిరెడ్డిని ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించాల‌ని ఆమె అభ్య‌ర్థించారు.