ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ నూతన కమిటీలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ పనబాక లక్ష్మికి సముచిత స్థానం లభించింది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీలో నూతన కమిటీలో పలువురికి వివిధ పదవీ బాధ్యతలు అప్పగిస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నానాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మిని నియామిస్తూ టిడిపి ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు ఎంపీగా పూర్వపు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పనబాక లక్ష్మి తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతూ పనిచేసే లక్ష్మిగా పేరు పొందారు. దీర్ఘకాలికంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె గతంలో 4 సార్లు ఎంపీ గా, రెండు సార్లు కేంద్ర మంత్రి గా పనిచేసారు. 2019లో నారా చంద్రబాబు సమక్షంలో తన భర్త పనబాక కృష్ణయ్య తోపాటు టిడిపిలో చేరారు. డాక్టర్ పనబాక లక్ష్మిని తిరుపతి పార్లమెంట్ టిడిపి ఎంపీ అభ్యర్థి గా బరిలోకి దింపారు. 2022లో జరిగిన ఉపఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి గా మరల బరిలో నిలిచారు. రెండు సార్లు ఆమె ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో పనబాక లక్ష్మికి తిరుపతి ఎంపీ సీటు వస్తుందని ఆశించగా టిడిపి జనసేన బిజెపి మిత్రపక్షంగా ఏర్పడడంతో ఆ సీటును బిజెపి అభ్యర్థికి కేటాయించారు. ఒక దశలో ఆమెను సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది కూడా. అనుహ్యయంగా సుళ్ళూరుపేట ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె అయిన డాక్టర్ నెలవల విజయశ్రీ కి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఎట్టకేలకు పనబాక లక్ష్మికి టిడిపిలో సముచిత స్థానం లభించడంతో ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. టిడిపి నూతన కమిటీ వివరాలు:రాష్ట్ర టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు పనబాక లక్ష్మి ని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో బాపట్ల పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్‌బాబు, టీడీపీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధులుగా కోడూరు బాలసుబ్రహ్మణ్యం(తిరుపతి), ఉన్నం మారుతిచౌదరి (కల్యాణదుర్గం), రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా పుట్టం బ్రహ్మానందరెడ్డి(ఆత్మకూరు), కేఎం జకీఫుల్లా(అనంతపురం అర్బన్‌), ఇందుకూరి సుబ్బలక్ష్మి( శృంగవరపుకోట), కనపర్తి శ్రీనివాసరావు(గుంటూరు), మాన్వి దేవేంద్రప్ప, గుడిసె ఆది కృష్ణమ్మ(ఆదోని), జంపాల సీతారామయ్య, కేవీవీ సత్యనారాయణరావు(మైలవరం), రాష్ట్ర కార్యదర్శులుగా కే జయరామ్‌ నాయుడు(అనంతపురం), బూరగడ్డ కిషన్‌తేజ(పెడన), కోటగుల్లి సుబ్బారావు, కిల్లో వెంకట రమేశ్‌ నాయుడు(పాడేరు), కల్లపరి బుడ్డారెడ్డి(ఆధోని), కే తిమ్మయ్యచౌదరి(పత్తికొండ), చప్పిడిమహేశ్‌నాయుడు(రాజంపేట), దొడ్డా వెంకట సుబ్బారెడ్డి(కనిగిరి), డాక్టర్‌ అయితాబత్తుల సత్యశ్రీ(అమలాపురం), గేదెల శ్రీనుబాబు(విజయనగరం), మోజూరు తేజోవతి(బొబ్బిలి) నియమితులయ్యారు.