ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): మాజీ ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడు మాట‌ల మ‌నిషి కాద‌ని…ఆయ‌న చెప్పింది చేస్తార‌ని… చేసి చూపిస్తార‌ని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తె సింధూర పొంగూరు తెలిపారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో… ఆమె నెల్లూరు న‌గ‌రం 45వ డివిజ‌న్ విజయ మహల్ రైల్వే గేట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో.. మ‌హిళాశ‌క్తి టీం, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో క‌లిసి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ముందుగా సింధూర‌కి ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. డివిజ‌న్‌లోని ప్ర‌తీ షాపుకెళ్లి…2014 నుంచి 2019 వ‌ర‌కు నారాయ‌ణ చేసిన అభివృద్ధిని వివ‌రించారు. ప్ర‌చారంలో టిఫిన్ దుకాణంలో దోసెలు పోస్తూ… వ్యాపారాస్తుల‌తో స‌ర‌దాగా గ‌డిపారు. ప్ర‌జ‌ల్ని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ వారి స‌మ‌స్య‌లు…క‌ష్టాలు, బాధ‌లు తెలుసుకుంటూ ముందుకు సాగారు. అనంత‌రం సింధూర పొంగూరు మీడియాతో మాట్లాడారు. ఏ ఇంటికెళ్లినా…ఏ షాపుకెళ్లినా…అమ్మ మీరు మ‌మ్మ‌ల్ని అడ‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని…ఇంత క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని…మా ఓటు సైకిల్ కే…గెలిచేది నారాయ‌ణ సారే అని ప్ర‌జ‌లే మాకు హామీ ఇస్తుండ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. నిన్న నెల్లూరుకి మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు వ‌చ్చార‌ని…ఆయ‌న ప్ర‌జ‌ల‌కి చాలా విష‌యాలు తెలియ‌జేశార‌న్నారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఎంతో అభివృద్ధి చేశార‌ని…అదే విధంగా రాష్ట్రానికి ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు తీసుకువ‌చ్చార‌న్నారు. దాంతో…రాష్ట్రానికి ఎంతో ఆదాయం వ‌చ్చిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కి తెలియ‌జేశార‌న్నారు. కానీ ఆ త‌రువాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం ఆ ఖ‌జానాన్ని మొత్తం ఖాళీ చేసేసింద‌న్నారు. నాయ‌కుడంటే…రాష్ట్రానికి ఆదాయం తెచ్చేవాడ‌ని… అలాగే ప్ర‌జ‌ల చేత కూడా సంపాదించేట‌ట్లు చేశాడ‌న్నారు. ఆయ‌న విజ‌న్ ఉన్న నాయకుడ‌న్నారు. చంద్ర‌బాబు మాట‌ల మ‌నిషి కాద‌ని…ఆయ‌న చెప్పిందే చేస్తార‌ని…చేసి చేపిస్తార‌న్నారు. అలాగే టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌తో ఆయ‌న చేయ‌బోతున్నారో ఆల్ రెడీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశార‌న్నారు. ముఖ్యంగా ఇంట్లో ఎంత మంది పిల్ల‌లుంటే వారంద‌రికి రూ. 15వేలు, 18 ఏళ్లు దాటిన‌ ప్ర‌తీ మ‌హిళ‌ల‌కి నెల‌కి రూ. 1500, ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండ‌ర్లు, ఫించ‌న్లు 3వేల నుంచి 4వేలు, విక‌లాంగుల‌కి రూ. 6వేలు పెంచ‌డం వంటి అనేక మంచి కార్య‌క్ర‌మాల‌ను చంద్ర‌బాబు తీసుకువ‌స్తున్నార‌న్నారు. అర్హులైన ప్ర‌తీ ఒక్క‌రికి ఫించ‌ను అందించ‌డ‌మే టీడీపీ ల‌క్ష్య‌మ‌న్నారు. క‌ల‌ల‌కు రెక్క‌లు కార్య‌క్ర‌మం ద్వారా యువ‌తీ యువ‌కుల‌కు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తున్నార‌న్నారు. ఆ ఉద్యోగాలు వ‌చ్చేంత వ‌ర‌కు కూడా నిరుద్యోగ భృతి కింద నెల‌కి రూ. 3వేల వంతున ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంద‌రూ సైకిల్ గుర్తుపై ఓటేసి… మా నాన్నని ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాల‌ని కోరారు. నేను కూడా ఒక డాక్ట‌ర్ ని…నారాయ‌ణ మెడిక‌ల్ క‌ళాశాల‌లో చ‌దువుకున్నాన‌ని…వ్యాక్సిన్ అనేది బ‌య‌ట నుంచే వ‌స్తుంద‌న్నారు. ఆ వ్యాక్సిన్‌కి ప్ర‌భుత్వం ఒక ఎమ్మార్పీ రేట్‌ను సెట్ చేశార‌ని, అయితే నారాయ‌ణ హాస్పిట‌ల్‌లో ఆ వ్యాక్సిన్‌ని ఎమ్మార్పీ ధ‌ర కంటే…త‌క్కువ‌కే నారాయ‌ణ ఇచ్చార‌ని…దానికి మించి ఇవ్వ‌లేద‌న్నారు. సుమారు నారాయ‌ణ ఇనిస్టిట్యూట్‌ల‌లో 50వేల మంది ఉద్యోగులు ఉన్నార‌ని…వారంద‌రికి కూడా ఫ్రీ గానే నారాయ‌ణ వ్యాక్సిన్ ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. డ‌బ్బుల కోసం అడ్డ‌దారులు తొక్కాల్సిన అవ‌స‌రం నారాయ‌ణ‌కి లేద‌న్నారు. ఇలాంటి అస‌త్య ఆరోప‌ణ‌ల్ని ప్ర‌జలెవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు.