ప్రభాతదర్శిని,(రేణిగుంట:- ప్రతినిధి):సమాచార హక్కు చట్టం ఉల్లంఘించిన విషయంగా , సమాచార హక్కు చట్టం చట్టం సెక్షన్ 18(1) ఫిర్యాదుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వారి డబల్యూ పి.8267/ 2023, Dt.25-07-2023, ద్వారా సమాచార కమిషన్ కి ఆదేశాలు అందిన నేపథ్యంలో సమాచార కమిషనర్ మహబూబ్ భాష విచారణ జరిపారు.తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త, ఆర్ టి ఐ పి ఎస్ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుబ్రహ్మణ్య రెడ్డి కేసులో తిరుపతి జిల్లా పూర్వపు తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ మరియు ప్రస్తుత సత్యవేడు సబ్ రిజిస్ట్రార్ రూప వాణి కి 25 వేల రూపాయలు జరిమానా విధించిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్ భాషా .దరఖాస్తుకు సమాధానం ఇవ్వటానికి 771 రోజులు ఆలస్యం చేసినందుకు రోజుకు 250 రూపాయలు చొప్పున 1,92,750 జరిమానా విధించాలి. కానీ సమాచార హక్కు చట్టం ప్రకారం 25000 గరిష్టంగా మాత్రమే జరిమానా విధించాము అన్న ప్రధాన కమిషనర్ మహబూబ్ భాషా . అదేవిధంగా రెండవ కేసు : పూర్వపు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆనంద రెడ్డి, ప్రస్తుతం చిత్తూరు జిల్లా రిస్ట్రార్ కార్యలయం రిజిస్ట్రార్ కి 25,000/- పెనాల్టీ విధింపు …ఆర్టీఐ దరఖాస్తుకు నిర్ణీత 30 రోజుల సమయంలో సమాధానం ఇవ్వకుండా చట్టాన్ని నిర్వీర్యం చేసి పౌరుల ప్రాథమిక హక్కులు నిర్వీర్యం చేసే, రాజ్యాంగ విలువలు పాటించకుండా తప్పులు చేస్తున్న పౌర సమాచార అధికారి( పి ఐ ఓ ) లకు, రాష్ట్ర ఆర్టీఐ ప్రధాన కమీషనర్ వారి ఉత్తర్వు సహ చట్టం అమలులో ఆశలు అడుగంటి పోతున్న తరుణంలో సహ చట్టం అమలుకు జీవం పోసే పరిణామం అని , చట్టం ఉల్లంఘించే పి ఐ ఓ లకు ఇది ఒక హెచ్చరిక అని ఫిర్యాదుదారు సుబ్రమణ్యం రెడ్డి అభిప్రాయ పడ్డారు.